జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: పశ్చిమ బెంగాల్ సీఎం

  • ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సువేందు అధికారి
  • ప్రజారవాణాపై ఆధారపడే మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్న సీఎం
  • ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచి అమలు చేస్తామని హామీ
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అన్నారు. జూన్ 1వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ప్రజారవాణాపై ఆధారపడే లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఇందులో ఉద్యోగినులు, విద్యార్థులు కూడా ఉంటారని తెలిపారు.

పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచి అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న సామాజిక సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిని ఐదేళ్ళు పొడిగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

Mamata Banerjee
West Bengal
Free Bus Travel
Ayushman Bharat
West Bengal CM
Welfare Schemes

More Telugu News